పుట:Adhunikarajyanga025633mbp.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యకులను తయారుచేసి, ప్రజలకువారి శాసనసభానాయకులయొక్క పరిచయము కల్గించుటకు శాసనసభలుప యోగపడవలెను. తమనాయకు లెవ్వరుకానగునో, ఏనాయకులెంతెంతవారో, ఎవరెట్టివారో, కన్గొనుటకు ప్రజాసామాన్యము పూర్తిగా పార్టీలపైయాధారపడియుండుటకు మారు శాసనసభలపై యాధారపడుట లాభకరము. పార్టీ నాయకులకు స్వతంత్రాపేక్ష లేక, ప్రత్యేకవ్యక్తిత్వములేక తమమాటలకులొంగువారె ప్రియులగుదురు. శాసనసభకట్లుగాక ఎవ్వరువక్తలో ఎవ్వరుసమయానుకూలముగ చమత్కారముగ, ప్రజానురంజకముగా, ప్రశ్నలువేయుటకు, సమాధానముచెప్పుటకు వాదప్రతివాదముల జేయుటకు ప్రజలహక్కులకై శ్రద్ధవహించుటకు సమర్ధులో ఉత్సాహపరులో వారిష్టులగుదురు కనుక అట్టిస్వతంత్రేచ్ఛకల్గి స్వతంత్రవాదులై ప్రజాక్షేమాభిలాషులైన సమర్థులగు నాయకుల సూచించుటకు, తయారుచేయుటకు, శాసనసభలే సమర్థతకల్గియున్నవి. కొన్ని వత్సరములకొలది శాసనసభలయందు సభ్యులుగానుండి సభవారిమెప్పును బొందకల్గిననాయకులు వారివారి రాచకీయపార్టీలయందును ప్రాముఖ్యత సంపాదించుకొనగలరు. అట్టి ప్రముఖులనుండియే ప్రతిపార్టీయు తననాయకుల నేరుకొనును. మెజారిటీయందుండుపార్టీ మంత్రివర్గమునందు అట్టి ప్రముఖులలో కొందరికి స్థానములనొసంగుచుండును కనుక మంత్రులగువారు, ప్రజాసామాన్యము