పుట:Adhunikarajyanga025633mbp.pdf/217

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జ్యములందును శాసనసభలవృత్తాంతముల సంపూర్ణముగా ప్రకటించుహక్కు పత్రికలకుకల్గినది. మనదేశమందు 1932 సంవత్సరారంభమున ఇండియాగవర్నమెంటువారు ఈహక్కును తగ్గింపజూచిరి. కాని ఆపనినాగ లేదు. ఈహక్కుపత్రికలకు, ప్రజలకు ఉన్ననే శాసనసభలు ప్రజలయెడ తమధర్మమునెరపగలవు. మంత్రివర్గములకు, ప్రతికక్షలకు ఈహక్కు ఉపయోగకరము.

ఈలోటులదీర్చుటకు శాసనసభాసభ్యులు వారిరాచకీయపార్టీలు వివిధనియోజకవర్గములందు సభలజేసియు, కరపత్రముల ప్రచారముజేసియు, తమతమ చర్యలగూర్చిప్రజలకు తెలుప బ్రయత్నించుచున్నారుకాని, ప్రతిపక్షుల సమ్ముఖము దిట్టి ప్రచారముచేయలేకున్నారు. అందువలన, ప్రజలకు, శాసనసభలచర్యలగూర్చి చదువుటవలన కల్గు యుక్తాయుక్త విచక్షణజ్ఞానము బొందుటకవకాశములేకున్నది.

అమెరికాయందలి ముఖ్యమగుపట్టణములందు "పౌరసభలు" యేర్పరచబడుచున్నవి. వానియందు, ఇరుపక్షములవారు ప్రజలనలజడిపరచుచున్న రాచకీయసమస్యలను సక్రమముగా అన్నివైపులనుండియు చర్చించుచుందురు. ఈ "పౌరసభలు" బహిరంగముగా జరుపబడును. కనుక, ప్రజలెల్లరు వానిచర్చలందు పాల్గొనుటకు ఆచర్చలందొసంగబడు యుపన్యాసముల వినుటకు అవకాశముకల్గును. ఇట్టి "పౌరులసభ