పుట:Adhunikarajyanga025633mbp.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ములను, ధనాధిక్యులను, జమీందారులను గాంచి, పనివారు, రైతులు ఎట్లు వెరగొందుచున్నారో తలంచుకొన్నయెడల "రహస్యపుబాలెట్టుపెట్టె" పద్ధతి యెంతలాభమో కన్గొనవీలగును. ఆర్థిక సాంఘిక స్వాతంత్ర్యముబొందని ప్రజలున్నంత వరకు, వారి రాచకీయ స్వాతంత్ర్యమును, వోటుహక్కుద్వారా ప్రకటించుటకైన, ఈ"రహస్యపుబాలెట్టుపెట్టె" పద్ధతి యగత్యము.

V

ప్రజలతరపున నిలబడదగు అభ్యర్థులెట్టివారైయుండవలెను? వోటుహక్కుపొందినవారెల్లరు అభ్యర్థులుగా నుండుటయే మంచిదనుయభిప్రాయము, ప్రజాస్వామిక దేశములందెల్లెడ ప్రచారితమైయున్నది. జర్మనీయందుమాత్రము, ఇరువదివత్సరముల వయస్సు మించినవారెల్లరును, తదితర ముఖ్యరాజ్యాంగములందు, ఇరువదిరెండువత్సరముల వయస్సు వచ్చినవారెల్లరును, సంవత్సరమున రెండో లేక మూడో మాసములకాలము తమతమ గ్రామములు లేక పట్టణములందు నివసించుచుండినచో, వోటుహక్కు పొందగల్గుచున్నారు. ఫ్రాన్సునందుతప్ప మిగతాఅన్నిప్రజాస్వామిక రాజ్యాంగములందును స్త్రీలకు, పురుషులకు సమానమగు వోటుహక్కుకలదు. వోటుహక్కుపొందలేనివారెల్ల కుష్టులు, పిచ్చివారు, ఘోరకృత్యములకు శిక్షలననుభవించుచున్న వారును మాత్ర