పుట:Adhunikarajyanga025633mbp.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టకువీలులేదు. ఎవ్వరేమైనయందురేమో యనిగాని దౌర్జన్యముచేసెద రేమోయని కాని భయములేకుండ, వోటరు తనకునచ్చిన అభ్యర్థులకీ పద్ధతిప్రకారము తన వోటులనివ్వవచ్చును. కాని మనదేశమందు, వోటరులలో నధిక సంఖ్యాకులు, విద్యావిహీనులగుటచే "రహస్యపుబాలెట్టుపెట్టె" పద్ధతి అంతగా నుపయోగపడుట లేదు. చదువనువ్రాయను నేర్వని, వోటరులు మొత్తముమీద బహిరంగముగనే, తమ వోటులను, వివిధఅభ్యర్థులకిచ్చుట జరుగుచున్నది. కనుక, ఎన్నికలకుముందుగానే విద్యావిహీనులగు వోటరులనుండి, వాగ్దానముల కొందరు అభ్యర్థులుబొంది ఎన్నికల సమయములందు తమకే వోటులనిచ్చిరో లేదో విచారించుట కవకాశముబొందుచున్నారు. తన్మూలమున వోటరుల స్వాతంత్ర్యము మృగ్యమగుటయు, అభ్యర్థులపెత్తనము హెచ్చగుటయు తటస్థించుచున్నది. కాని శ్రీ జానుస్టూఅర్టుమిల్లుగారీ "బహిరంగపుఎన్నికల" పద్ధతినే బలపరచుచుండెడివారు. బహిరంగముగా తనకునచ్చిన అభ్యర్థులెవ్వరో చెప్పజాలని వోటరులు వోటుబొందుట కర్హులుకారనియు, "రహస్యపుబాలెట్టుపెట్టె" పద్ధతిప్రకారము, వోటరులు, అభ్యర్థులమోసము చేయకల్గెదరనియు, లంచముల వివిధఅభ్యర్థులనుండియు గైకొనజూతురనియు తలంచెను. కాని, మన గ్రామములందెట్లు ప్రజలు ముఠాదారుల యాధిక్యతకు భయపడుచున్నారో, భూస్వా