పుట:Adhunikarajyanga025633mbp.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మే. కొన్ని దేశములందు (అమెరికా, ఇంగ్లండులందు) ప్రభుత్వపు అనాధశరణాలయములందు పోషణబొందువారికి వోటుహక్కుయివ్వబడుటలేదుగాని, జర్మనీయందివ్వబడుచున్నది. కొన్నిరాజ్యాంగములందు, దివాలాతీసినవారికి వోటుయిచ్చుటలేదుకాని జర్మనీ బాల్కనురాజ్యములం దివ్వబడుచున్నది. ఇంగ్లాండు, అమెరికాదేశములందు సివిలుసర్వీసు యుద్యోగులగు, రక్షణదళముల యుద్యోగులకు వోటుహక్కు యివ్వబడుచున్నది. జర్మనీయందు, అట్టియుద్యోగులు తమవోటును పోస్టుద్వారా పంపుకొను అవకాశముకూడ కలుగ జేయబడుచున్నది. క్రమక్రమముగా, వోటుహక్కు పొందజాలనివారి తరగతులు తగ్గింపబడుటయు వోటుహక్కు బొందగల్గువారి సంఖ్య హెచ్చుచుండుటయు, అన్ని దేశములందును జూడనగును.

ఎట్టివారు వోటుహక్కుబొందజాలరో, వారు అభ్యర్థులుగానుండుటకు వీలులేదు. వోటుహక్కుబొందినను, ప్రభుత్వోద్యోగులైనవారు, ఇంగ్లండు, అమెరికా, ఫ్రాన్సుదేశములందు, అభ్యర్థులుగా నిలబడరాదు; జర్మనీయం దట్లుగాక, రక్షకదళములందున్న వారుకూడ, అభ్యర్థులుగా నిలబడవచ్చును. కాని, ప్రభుత్వోద్యోగులు అభ్యర్థులుగా నిలబడుట లాభదాయకముకాదు; పైగా ప్రజాస్వాతంత్ర్యములకు భంగకరమని, ఇంగ్లండుదేశపుచరిత్రయే చెప్పుచున్నది. క్రీ. శ.