పుట:Adhunikarajyanga025633mbp.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకటింపగలనని చెప్పగల్గు స్థితియందున్ననే, ఆతని యుపన్యాసములయెడ, శాసనసభయు, దానిద్వారా, ప్రజలును గౌరవాదరముల జూపెట్టుట సాధ్యము. అటులగాక, ఇప్పటివలె, ప్రత్యేకసాంఘిక ప్రతినిధులు, శాసనసభయందుండు వరకు "నేను హిందువుడను నాహిందువు లిట్లుతలంచుచున్నారు. నేను మహమ్మదీయుడ. నావారిట్లు భావించుచున్నారు" అని పల్కునంతవరకు, శాసనసభ రౌండుటేబులుగా పరిణమించి, కార్యసాధన కుపయోగపడక, వివిధసంఘప్రతినిధుల ప్రదర్శనరంగమై, ప్రజాసామాన్యపు టభిప్రాయముల ప్రకటింప నసమర్ధత బొంది, వివిధసంఘములమధ్య సామరస్యత కల్గించుటకు మారు, విముఖత కల్గించుట కుపయోగపడును. కనుకనే, మనదేశమందు, ఈప్రత్యేకసాంఘిక ప్రాతినిధ్యసూత్ర మమలుజరుపబడుచుండిన క్రిందటి పన్నెండువత్సరములం దదివరకు కని వినియెరుంగనంతగా, మతవైషమ్యములు బలసి, వివిధమతస్థుల కలహములు, కొట్లాటలధికమగుచున్నవి. వివిధమతనాయకులును ఈసంఘవైపరీత్యములకు ప్రత్యేకసాంఘిక ప్రాతినిధ్యము కారణమని యొప్పుకొనక తప్పుట లేదు.

ఈప్రత్యేక సాంఘిక ప్రాతినిధ్యముద్వారా కల్గు దుర న్యాయముల గమనించియే, నెహ్రూకమిటీవారు, ఏకగ్రీవ