పుట:Adhunikarajyanga025633mbp.pdf/191

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ముగా, "సమిష్టినియోజకవర్గములందు ప్రత్యేకప్రాతినిధ్యము" నకు తావు కల్గించుటకు, అంగీకరించిరి. (Reservation of seats in joint Electorates) ఈపద్ధతిప్రకారము, ప్రతి నియోజకవర్గమునకును, మూడు, నాల్గు, లేక, ఐదుగురు సభ్యుల నెన్నుకొనుహక్కు ప్రసాదించబడును; ఆసభ్యులలో, ఒక్కరో, ఇద్దరో, తప్పక, ఆనియోజకవర్గమందలి, మనారిటీ మతస్థులు, లేక, సంఘీయులకు చెందవలెనని నిర్ణయించబడును. మద్రాసు రాజధానియందు, మహమ్మదీయులకు, నిమ్నజాతులకు క్రైస్తవులకు, ఇట్టిప్రత్యేకప్రాతినిధ్య మివ్వబడును. అప్పుడు, హిందూఅభ్యర్థులతోబాటు, అల్పసంఖ్యాకులకుజెందిన అభ్యర్థులును, ఒకేనియోజకవర్గమునందు నిలబడెదరు. ప్రత్యేకింపబడిన ప్రతిసభ్యత్వమునకు, (మహమ్మదీయుల స్థానమనుకొందము) ఇద్దరోముగ్గురో అభ్యర్థులు సామాన్యముగా నిలబడెదరు. వారందరికి, అన్నిమతస్థులు కులస్థులు తమవోటుల నివ్వవలెను. అభ్యర్థులలో (మహమ్మదీయులు) ఎవ్వరు సర్వమతస్థులకును, సర్వజాతీయులకును అనుకూలురో, యిష్టులో, వారు ఆమైనారిటీసంఘమునకు గాను ఎన్నుకొనబడెదరు. ఈవిధముగా, సభ్యులెల్లరు (మెజారిటీ మైనారిటీసంఘముల ప్రతినిధులు) ఎన్నుకొనబడుట వలన, హిందూమతస్థుడగు సభ్యున కెంతహక్కు అవకాశ