పుట:Adhunikarajyanga025633mbp.pdf/188

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎన్నికయందొ అట్టివిపరీతపరిస్థితులు, ఎల్లరు ఆశ్చర్యపడుచుండ, కొంతకాలమువరకు జరుగుటకై, అట్టిరాజ్యాంగపు టేర్పాటులను, రాజ్యాంగవిధానపుచట్టమునందే, చేర్చుటెంతయు, అవినీతికరమును, అభాగ్యమును కాదా?

ప్రత్యేక ప్రాతినిధ్య సూత్రమును, తాత్కాలికావసరములకై, అంగీకరించినను, అద్దానిని, ప్రత్యేక సాంఘిక నియోజకవర్గములందా, లేక, సమిష్టినియోజజవర్గములందా అమలునందు పెట్టుట? ఇప్పటివరకు అమలునందున్నవి, ప్రత్యేక సాంఘిక నియోజకవర్గములే - మహమ్మదీయులు, క్రైస్తవులు, సిక్కులు, తమతమ ప్రత్యేకసాంఘిక నియోజకవర్గములద్వారానే, తమప్రతినిధుల నెన్నుకొనుచున్నారు. అనగా, వోటరులందరు మహమ్మదీయులే. ఎన్నుకొనబడు సభ్యుడును మహమ్మదీయుడై యుండును. అటులనే తదితర సంఘములుకూడ, తమనియోజకవర్గముల బొందియున్నవి. ఈనియోజకవర్గములద్వారా యెన్నుకొనబడు సభ్యులు, శాసనసభలయందు తాముచేయు కార్యములకు, ఉపన్యాసములకు, నడచు నడతకు, వివిధమతస్థులు, కులస్థులతోజేరిన సంఘమునకంతకు బాధ్యులై యుండుటకు మారుగా, తమతమ ప్రత్యేకసంఘీయులకు మాత్రమే బాధ్యులై యుండవలెను. కనుక, ప్రత్యేక సాంఘికనియొజకవర్గపు ప్రతిని