పుట:Adhunikarajyanga025633mbp.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బొంది, ఆర్థిక స్వాతంత్ర్యత కల్గి, ఆత్మవిశ్వాసము సంపాదించువరకు) అభయ ప్రధానము కల్గించనగును. ఈసూత్రమును స్త్రీలయెడ, నిమ్న జాతులవిషయమందు బ్రిటిషుప్రభుత్వము అంగీకరించుచున్నది. అంతియేకాని, వివిధరాష్ట్రములందు, అమితమగు మైనారిటీయందు, జనసంఖ్యనుబట్టి వివిధమతస్తులుండగా, వారిజనసంఖ్య ననుసరించి రాదగు స్థానములకంటె, హెచ్చుస్థానములు కావలెనని, ఆసంఘముల నాయకులు కోరుటకాని, వానిని మెజారిటీసంఘనాయకు లొసంగుటకాని భావ్యముకాదు. అట్లొసంగుచో, ఎంత"ఆధిక్యసభ్యత" (Weightage Representation) ఏ యేసంఘముల కేయే కారణములకై యివ్వవలెనో, ఎవ్వరైన నిర్ణయించుటెట్లు? అట్టి "యాధిక్యసభ్యత" నిచ్చుటచే, ప్రజాస్వామికము, బాధ్యతాయుత మంత్రివర్గమును, అధిక సంఖ్యాకులగు ప్రజాప్రతినిధులవలన యేర్పరుపవలసిన బాధ్యత నేవిధముగా నిర్వర్తింపకల్గును? అశేషప్రజలచే యెన్నుకొనబడిన ప్రతినిధులలో అధికసంఖ్యాకులు మంత్రివర్గము నేర్పరచుటకుమారు, అల్పసంఖ్యాకులగు ప్రజలచే యెన్నుకొనబడిన ప్రతినిధులు మంత్రివర్గము నేర్పరచుట తటస్థించునుగదా! అట్టివిషమ పరిస్థితులు, అల్పసంఖ్యాకుల రాజ్యాంగమందు కల్గిన నెవ్వరును ఆశ్చర్యపడరుకాని, ప్రజాస్వామికమందు ఏయొక్క