పుట:Adhunikarajyanga025633mbp.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లదు అయినను యీసూత్రము నాచరణయందిడుటవలన యెట్టిపర్యవసానములు కల్గునో విచారించినకాని, ఎంతకాల మెట్టి అల్పసంఖ్యాకులను, అనాధలగు స్వయంసహాయశక్తిలేని ప్రజలకు, ఈప్రత్యేకప్రాతినిధ్య అవకాశము కల్పింపనగునో తెల్పుటకు వీలులేదు.

క్రిందటి పదివత్సరములనుండి, ప్రత్యేకసాంఘికప్రాతినిధ్యము వివిధసంఘమములకు ప్రసాదించబడినది. ప్రజలయం దధికసంఖ్యాకులగు, బ్రాహ్మణేతరులకు, వారి అసహాయస్థితిని గమనించి, ప్రత్యేకసాంఘికప్రాతినిధ్య మేర్పరచబడెను. మన రాజధానియందు ప్రతిజిల్లాకును, ఒక్కసభ్యత్వమైన బ్రాహ్మణేతరులకు చెందవలెనని, మెస్టనుకమిటీవారు స్థిరీకరించినను, మొత్తముమీద, ఈసూత్రపు యూత బొందకయే బ్రాహ్మణేతరులు మద్రాసు కౌన్సిలునందు, అధికసంఖ్యాకములగు సభ్యత్వముల సంపాదించుకొనగల్గిరి. అటులనే, బొంబాయి రాష్ట్రమందును, బ్రాహ్మణేతరులు తమసంఘమునకు తగిన ప్రాతినిధ్యము, ఏప్రత్యేక ప్రాతినిధ్యసహాయము కోరకయే పొందకల్గిరి. లోధియనుకమిటీవా రీవిషయము గమనించి, మద్రాసుబ్రాహ్మణేతరులకు ప్రత్యేకప్రాతినిధ్య మగత్యములేదని సూచించి, సైమనుకమీషనువా రేమో బొంబాయిబ్రాహ్మణేతరులకు ఇంకా కొంతకాలమువరకు ఈప్రత్యేకహక్కు యుంచుట మేల్గూర్పదను నెపముపై,