పుట:Adhunikarajyanga025633mbp.pdf/177

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లతో, జమీందారులతో పైకులములవారితో పోటీపడుచో తమఅభ్యర్థులు జయమంద రేమోయనుభయము, హరిజనుల కగత్యములేదు. అటులనే, క్రైస్తవులకుగాని, మహమ్మదీయులకుగాని, తదితర అల్పసంఖ్యాకులగు ప్రజలకుగాని కల్గనవసరములేదు. ఈప్రత్యేకప్రాతినిధ్యము, పాశ్చాత్యదేశములందు అంగీకరింపబడుచో, సోషలిస్టులు, లేబరుపార్టీవారు, అన్నియెడల మెజారిటీలబొంది, మంత్రివర్గముల నేర్పరచనగును. మంత్రివర్గము నేర్పరచువారు, ప్రత్యర్థికక్షియందుండువా రధికముగా, కార్మిక ప్రతినిధులైయుండుట సాధ్యమగును. కనుక, ప్రత్యేకప్రాతినిధ్యసూత్రము దీనులకు, అల్పసంఖ్యాకులకు, బీదలకు, అనాధలకు, లక్షలకొలది ధనవ్యయము కల్గించు ఎన్నికలతోకూడుకొనిన యీనాటిరాచకీయ జీవితమందు, సులభమగుటకు తగురక్షణ కల్గించును. ఇటుల, ఆర్థికముగ, సాంఘికముగనుండు విభేదములకుకూడ శాసనసభలయందు ప్రాతినిధ్యముకల్గించుట, ప్రాతినిధ్యసూత్రములకే విరుద్ధమనుట పొరపాటు. రాచకీయపక్షముల కెట్లు తగుప్రాతినిధ్యము బొందుట కవకాశముల నిచ్చుచుంటిమో, అటులనే, ఈకాలపు ప్రాతినిధ్యపు పద్ధతులందు తదితరులతో పోటీపడి తమకు రాదగు ప్రాతినిధ్యప్రాముఖ్యత బొంద లేని అవిటివారికి, ప్రత్యేక ప్రాతినిధ్యమను యూతను కొంతకాలమువర కొసంగుటలో విపరీతమేమియు నుండజా