పుట:Adhunikarajyanga025633mbp.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తామును ఆహక్కును నిల్పుటే మంచిదనిరి. ధనికులు, ప్రాపకముకలవారైనను, అల్పసంఖ్యాకు లనుకారణముపై, అనుభవపరులును, రాజనీతికోవిదు లనునెపముపై, సాధారణయెన్నికలందు అవస్థలుపడలేరనుసాకుపై, మాంటాగ్యూఛెల్‌మ్సుఫర్డుకమిటీ, జమీందారులకు ప్రత్యేకముగా నిర్ణయింపబడిన స్థానములకంటె, ప్రజాబాహుళ్యమున కొసంగబడినస్థానములందే, హెచ్చుస్థానములు సంపాదించుకొనగల్గిరనుకారణముపై, సైమనుకమీషనువారు, జమీందారులకు ప్రత్యేకప్రాతినిధ్యమిచ్చుట, అనగత్యమని సూచించిరి. కాని లోధియనుకమిటీవారు, బ్రిటిషువారి రాజ్యరక్షణకై, జమీందారుల మంచిచేసుకొనుటకై, వారికికూడ ప్రత్యేకప్రాతినిధ్యముంచుట మంచిదని సూచించినారు.

ఇక వర్తకులు, ప్లాంటరులుకూడ, తమకు ప్రత్యేకప్రాతినిధ్యము కావలెననికోరి, 1920 నుండియు ఆహక్కును పొందియున్నారు. ఇప్పటివరకు, ఎల్ల రాచకీయపక్షములవారును, ఈ యిరుబృందములకు, ప్రత్యేకప్రాతినిధ్యమును హెచ్చించుటకుకూడ సమ్మతించుచున్నారని చెప్పనగును. కాని, ఇట్టిబలవంతములు, ధనవంతములు అగు సంఘములకు ప్రత్యేక ప్రాతినిధ్యమిచ్చుటవలన, తదితరప్రజలకు నిస్సారత కల్పించుటయగును గనుకను, తమ్ముతాము రక్షించుకొనశక్తి కల్గియుండుటేకాక, తదితరుల లొంగదీసికొనగల్గుశక్తి కల్గిన