పుట:Adhunikarajyanga025633mbp.pdf/168

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మెజారిటీపద్ధతిని బొందినప్పటికంటె, హెచ్చుయిబ్బందేమియు కలుగజాలదు.

ఏకసభ్యనియోజకవర్గములందు, సాధారణమెజారిటీసూత్రము ననుసరించి, ఎన్నికలజరుపుచో, ప్రతివోటరునకును తానెవ్వరికి వోటునిచ్చుచున్నాడో ఆతడు పిమ్మట ఎన్నుకొనబడెనో, లేదో తెలుసుకొనుట సులభమనియు, ప్రపోర్షనల్ ప్రాతినిధ్యసూత్రప్రకారము జరుగు ఎన్నికలం దనేకసభ్యత్వములకై నిలబడు అభ్యర్ధులందరిలో ఎవ్వరినెన్నుకొనవలెనో తెలియక తమకిష్టులగువారు ఎన్నుకొనబడెదరో లేదోయని సంశయబాధను వోతరులుబొందెదరని కొందరు వాదించుచున్నారు. ఏకసభ్యనియోజకవర్గములందు నిలబడినవారిలో తమకిష్టమైన అభ్యర్థికి తమవోట్లు నిచ్చుట వోటరులకు సులభసాధ్యమే ! కాని, "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రప్రకారమైనను, సమిష్టినియోజకవర్గమందును (దానికి నల్గురుసభ్యత్వము లివ్వబడిననుకొందము) నిలబడిన అభ్యర్ధులలో ఎన్నిసభ్యత్వము లానియోజకవర్గమున కివ్వబడినవో, అన్ని అభ్యర్థులకు, వోటరులు తమవోట్లను వారివారి అవసరముల ననుసరించి యిచ్చుటకుమాత్రము విశేషకష్టమేమియు నుండదు. కాని ఇప్పుడు మన రాష్ట్రమందువలె ఒక జిల్లాకునాల్గు సభ్యత్వములున్న ప్రతివోతరును, తన నాల్గువోట్లును, తన కిష్టులగు నల్గురు అభ్యర్ధులకిచ్చుట ఆచారమైయున్నది. 'ప్రపో