పుట:Adhunikarajyanga025633mbp.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లకుమాత్రము భంగముకల్గుట దుస్తరమగుచుండును. కాననే ఇంగ్లాండు, అమెరికా దేశములందు, మెజారిటీసూత్రపు ప్రభావమువలన కల్గువిపరీతపరిస్థితులగాంచినవారు, బలహీనమగు తాత్కాలికమగు మంత్రివర్గమునకైన యోర్చి, "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రమునే బలపరచుచున్నారు.

'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యసూత్రము నవలంభించిన దేశములందు, పార్టీలకు హెచ్చుప్రాముఖ్యత కల్గునని శ్రీబేజిహోటు మున్నగు ఇంగ్లీషురాచకీయజ్ఞులు వాదించియుండిరి. కాని, ఆపద్ధతిని అవలంబించని, ఇంగ్లాండు, అమెరికాదేశములందె రాచకీయపక్షములు అత్యంతప్రాముఖ్యతవహించియుండుటయు, రాచకీయపక్షములకు చెందనిఅభ్యర్థులు జయప్రదులగుటకు దుస్సాధ్యమగుటయు తటస్థించుచున్నప్పుడు, 'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యపద్ధతి నవలంబించిన దేశములందు, రాచకీయపక్షములు ప్రాముఖ్యతబొందుటలో నాశ్చర్యమేమి ? ఈకాలపు ప్రజాస్వామిక రాజ్యాంగము జయప్రదముకావలెనన్న ప్రజాప్రతినిధిసభ ప్రజలయభిప్రాయమును సంతృప్తికరముగా ప్రతిఫలింపజేయవలయునన్నను, మంత్రివర్గమును అదుపుఆజ్ఞలందుంచవలయునన్నను, రాచకీయపార్టీ లేర్పరచబడి, సౌష్టవముజెందుట గత్యమగుచున్నది కాన, 'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యసూత్రము నంగీకరించుటవలన, సాధారణ