పుట:Adhunikarajyanga025633mbp.pdf/169

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ర్షనల్" ప్రాతినిధ్యమం దట్లుకాక, ప్రతివోటరును తనకత్యంత ప్రీతికరమగుఅభ్యర్థి యెవ్వరో వారికి మొదటిరకపువోటునిచ్చి అతనికంటె తక్కుసహితుడగు రెండవఅభ్యర్థికి, రెండవరకపువోటునిచ్చి, మూడవరకమైనను ఆదరణపాత్రుడైన అభ్యర్థికి మూడవరకపువోటునిచ్చి, తుదివాడైనను, తనకంగీకృతమైన అభ్యర్థికి నాల్గవరకపువోటు నిచ్చుటకే అధికారము కలదు. అనగా, ఆతని యభిప్రాయమం దీ నల్గురు అభ్యర్థులు సమానులై యుండుటకుమారు ఒకరికంటెనొక్కరు అధికులుగా య్ందురు. ఆతనికి అత్యుత్తమమైనవోటు ఒక్కటే యుండును కాని, వివిధరక్ములైన మూడువోటులు గూడ ప్రసాదించబడును.

అట్టివోటరునకు, అత్యంతప్రీతికరమై యున్న అభ్యర్ధియే తప్పక జయప్రదుడు కావలెనని తలంపుకల్గి, ఇతరస్థానములగూర్చి అంతయాతురతలేనిచో, తన ప్రధానమగువోటును ఒక్కరికే యిచ్చి, మిగిలినవోటుల నుపయోగించకపోవచ్చును. అనగా, ప్రతివోటరునకు, ఈపద్ధతివలన తనకిష్టులగు అభ్యర్ధులందు, వారివారి ఆధిక్యతల ననుసరించి నాల్గు అంతస్థులుగా నేర్పరచి వారివారి యోగ్యతల ననుసరించి వారికి తన వేరువేరురకములగువోట్లను ప్రసాదించు యవకాశము కల్గుచున్నది. ఈవిధముగా తనవోట్లను ఎవ్వరెవ్వరి కెట్లెట్లు యివ్వవలయునో నిర్ణయించుకొనుట కేవోటరునకును కష్టము కాజాలదు.