పుట:Adhunikarajyanga025633mbp.pdf/166

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ము నడుపవలెనన్న మంత్రివర్గమును 310 సభ్యులు బలపరచవలయును. ఇంతబలము సంపాదించుకొనవలెనన్న, 'నాజీ' పార్టీవారు మధ్యపార్టీవారు, జాతీయవాదులతో సమ్మేళన మేర్పరచుకొనవలసియున్నది. అనగా మూడుప్రధానమగు పార్టీలుచేరినగాని, మంత్రివర్గము నేర్పరచుటకు వీలులేదు. "నాజీలు" కాక, జాతీయవాదులు (36) మంత్రివర్గము నేర్పరుప దలంచుచో, తదితరబృందములు (41) మధ్యపార్టీ (76) సోషలిస్టుల (132) సంపూర్ణసహకారమును బొందవలసియున్నది.

కనుక నాజీపార్టీ వారి మంత్రివర్గము కాని, జాతీయవాదుల మంత్రివర్గముకాని, తమతమపార్టీ ప్రణాళికలననుసరించి రాజ్యాంగము నడుప ప్రయత్నించుటకు వీలులేదు. ఇందువలన రాజ్యాంగపు ప్రధానధర్మములకు, సూత్రములకుమాత్రము భంగముకలుగకుండును. పెత్తనమందున్న మంత్రివర్గము ఏయొక్క రాచకీయపక్షమునకు సంపూర్ణమగు రాచకీయకార్య ప్రణాళికను అంగీకరించి, పార్టీకనుకూలమగు కార్యకలాపమును సాగించుటకు సాధ్యముకాకపోవచ్చును. కాని, మంత్రివర్గమందుజేరు వివిధరాచకీయపక్షములకు సమ్మతమగు కార్యక్రమమునుమాత్రము అమలుపరచవచ్చును. అట్టి మంత్రివర్గపుచర్యలు, ప్రతిపక్షీయునకుగూడ, అత్యంతముగ విరుద్ధములై యుండజాలవు గనుక, రాజ్యాంగపు మూలసూత్రము