పుట:Adhunikarajyanga025633mbp.pdf/165

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జూపెట్టక సాధారణప్రజల రాచకీయహక్కులన్న జాగ్రత్తపడని "నాజీపార్టీ"వారు ఇంగ్లీషువారి ఎన్నికపద్ధతులప్రకారము, ఎన్నికలు జరిగించినట్లయినచో అత్యధికమగు మెజారిటీని సంపాదించుకొని రైష్‌టాగ్ నందుజేరి ఆసభయొక్క ప్రజాప్రాతినిధ్యస్వరూపమునే మార్చివేసి, దానిని నేతిబీరకాయవతు, ఇటలీలో శ్రీముస్సోలీనిగారు ఆదేశపుపార్లమెంటును జేసినట్లు "రైష్‌టాగ్"ను నామసూత్రావశిష్టమొనర్చి, ప్రజాస్వామికము నంతమొందించి రిపబ్లికునే సాంతముజేసి, నిరంకుశాధికారమును దెచ్చిపెట్టకుందురా ? "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యపద్ధతివలననే జర్మనీయం దీనాడు (2-8-32) నాజీపార్టీవారు మంత్రివర్గమునేర్పరచ లేకున్నారు. ఆపద్ధతివలననే, ప్రజలచే తాత్కాలికముగా అసాదరణచేయబడుచున్న మిగతాపార్టీలు తమతమసభ్యత్వములను తమతరపునయున్నవోటరుల సంఖ్యననుసరించి సంపాదించుకొనకల్గినారు.

ఈ "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రము అమలునందు బెట్టుచో, ఏయొక్క రాచకీయపార్టీకిని, సంపూర్ణమగు మెజారిటీ లభ్యపడదని, జర్మనీదేశపు 1932 ఎన్నికలు ఋజువుచేయుచున్నవి. అచ్చట "నాజీ" పార్టీవారికి 228 సోషలిస్టులకు 132 కమ్యూనిస్టులకు 87 మధ్యపార్టీకి 76 జాతీయవాదులకు 36 తదితరులకు 41 స్థానములు లభ్యమయ్యెను. మంత్రివర్గము నేర్పరచి, "రైష్‌టాగ్" యొక్కయనుమతిపై రాజ్యాం