పుట:Adhunikarajyanga025633mbp.pdf/164

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పున, ఆపార్టీనాయకులగు శ్రీఅడోల్ఫు హిట్లరుగారి పేరున వోటరులను ప్రబోధించిరి. ఎన్నికలవివాదములవలన పదిమంది చనిపోవుటయు, వందమంది గాయపడుటయు తటస్థించెను. క్రీ. శ. 1931 సంవత్సరమందెట్లు ఇంగ్లాండునందు, "జాతీయ మంత్రివర్గపు" రాచకీయపక్షములు, ప్రజలనందరిని జాతిపేర దేశముపేర తమకే వోటులనివ్వమని ప్రబోధించిరో, అటులనే నాజీపార్టీ వారును, తమకు, తమజాతిగౌరవసార్ధకతకై, ఆర్ధికమోక్షముకై, వోటరులెల్లరు తమవోటులనిమ్మని ఉత్సాహపరచిరి. ఇంగ్లాండునందు, కన్సర్వేటీవు పార్టీవారు 606 సభ్యులలో రమారమి 582 సభ్యులను పొందిరి. కాని నాజీపార్టీ వారు అంత ఎక్కువమంది సభ్యులను సంపాదించలేదు. ఇందులకు కారణము ఇంగ్లాండునందు, ఏకసభ్యనియోజకవర్గము లేయుండి, మెజారిటీసూత్రమునకే ప్రాముఖ్యత యివ్వబడుటయు, జర్మనీయందు, సమిష్టి సభ్యనియోజకవర్గము లేర్పరచబడి "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యపుటేర్పాటులుండుటయే ! ఇంగ్లాండునందు యేర్పడిన నిరంకుశాధికారము పొందకల్గిన "జాతీయప్రభుత్వము", ఇంగ్లీషుప్రజల సాధారణరాచకీయమనో వృత్తులననుసరించి, బాధ్యతకల్గి ప్రవర్తించుటకు బ్రయత్నించుచున్నది. కనుక, ఇంతవరకు ఏవిధమగు విపరీతపర్యవసానములు కలుగ లేదు. కాని, బాధ్యతాయుతప్రభుత్వసంస్థల యందంతగా విశ్వాసములేక రిపబ్లికన్న అంత అభిమానము