పుట:Adhunikarajyanga025633mbp.pdf/162

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గారికిని, అపారమగు, అనవసరమగు, మితిమించిన మెజారిటీని దెచ్చిపెట్టి సార్థకతగా, కార్యసానుకూల్యముగా ప్రభుత్వచర్యల విమర్శించి, దేశసేవచేయలేనట్టి బలహీనపుస్థితికి, మైనారిటీనిబెట్టినది ఏకసభ్యనియోజకవర్గముగదా ? అప్పుడు శ్రీలాయడుజార్జిగారుగాని, ఇప్పుడు శ్రీరామ్సేమాక్డునాల్డుగారు గాని, అట్టి "మెజారిటీ"లు లేకుండానే రాజ్యపాలనము చేయకల్గెడివారు. కాని మితిమించినమెజారిటీలు వారికి సంపాద్యములైనంతమాత్రమున ఆప్రధానమంత్రులకు, తమకార్యనిర్వహణము కష్టతరమే యైనదికాని సులభసాధ్యముమాత్రము కాలేదు. బలిష్టమగు మైనారిటీపార్టీ పార్లమెంటునందున్నచో, ప్రజాభిప్రాయము వారివైపునకు సుముఖ మగునేమో. యనుభయము కల్పించి ప్రధానామాత్యుడు తన పార్టీవారిచే కొన్నిసంస్కరణముల నొప్పించగలడు. కాని, మైనారిటీ మరీబలహీనమైన మెజారిటీ పార్టీవారు నిర్భయముతో నిరంకుశముగా చేయరాని కార్యములజేసి, అవసరమగుకార్యముల నుదాసీనతతో లక్ష్యింపక ప్రజాబాహుళ్యపుక్షేమమును మరచుటయు, ప్రధానమంత్రియొక్క సలహాలను నిర్లక్ష్యపరచుటయు అనుభవనీయమై యున్నది. కనుకనే, ఇట్టి మెజారిటీపార్టీవారి నిరంకుశత నియోజకవర్గములందేకాక ప్రజాప్రతినిధి సభయందు, సాగుచుండుటవలన దేశారిష్టము కల్గును.