పుట:Adhunikarajyanga025633mbp.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పార్టీలు రెండే యుండుటవలన, ఎప్పుడును ఏయొక్కపార్టీయో పెత్తనమందుండి, మంత్రివర్గమునేర్పరచుచు, రెండు వత్సరములనుండి నాల్గు, లేక ఐదు వత్సరములవరకు, రాజ్యాధికారమును నడపుచుండుటయు, అందువలన, ఏదేనొక రాచకీయప్రణాళికను అమలుపరచుట కవకాశము కల్గుటయు సాధ్యమగుచున్నది. సమిష్టినియోజకవర్గములేర్పడి, "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రము అమలుపరచబడుచో, ఫ్రాన్సు, జర్మనీదేశములయందువలె అనేకములగు రాచకీయ బృందములు ప్రాముఖ్యతబొందుటయు, ప్రజాప్రతినిధిసభయందె యొక్కటి లేక రెండు రాచకీయబృందములకును మెజారిటీ సంపాద్యము కాకుండుటయు, అందువలన రెండుమూడు వత్సరములవరకు పెత్తనమందుండు మంత్రివర్గము నేర్పరుపవీలుకాకుండుటయు అనుభవైక వేద్యము. ఇందువలన, ఆదేశమునందు, ఏరాచకీయప్రణాళికనైనను, శ్రద్ధతో, ఓపికతో, పట్టుదలతో అమలునందు బెట్టుట కవకాశము కలుగుటలేదు. ఇట్టి యిబ్బందులు ఈపద్ధతినే అవలంబించుచో ఇంగ్లాండు, అమెరికాలయందును కల్గునుగనుక ఆదేశముల రాచకీయజ్ఞులు 'ప్రపోర్షనల్‌' ప్రాతినిద్యమును నిరసించుచున్నారు.

కాని, వారు ఏక సభ్యనియోజకవర్గములవలన కల్గుచున్న ఆపదను గమనించుట లేదు. యుద్ధానంతరము, శ్రీలాయడుజార్జిగారికిని, క్రీ. శ. 1931 యందు శ్రీరామ్సేమాక్డునాల్డు