పుట:Adhunikarajyanga025633mbp.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రము ప్రకారము, వివిధ రాచకీయబృందములు బయలుదేరినను మంత్రివర్గములు బృందములసమ్మేళనములద్వారానే ఏర్పరచుటకు వీలున్నను, ఇట్టి సమ్మేళనములపై యాధారపడుమంత్రివర్గములు దీర్ఘకాలము జీవించకున్నను, రాజ్యాంగమునకుమాత్రము భంగముకలుగదు; మెజారిటీవారి నిరంకుశత్వము సాగదు. ప్రజలస్వాతంత్ర్యము రక్షింపబడును. జర్మనీయందు క్రిందటి పన్నెండువత్సరములం దీవివిధబృందసమ్మేళనముల మంత్రివర్గము లేర్పడక, ఇంగ్లాండునందువలె, మెజారిటీపార్టీ వారి మంత్రివర్గములు పెత్తనమునకు వచ్చినట్లైన, ఇప్పటికెప్పుడో, విప్లవము గల్గి, అటుబోల్షివిజయమోకాని లేక, ఇటునిరంకుశరాజ్యపాలనమో యేర్పరచబడెడిదియే ! తుద "కీప్రపోర్షనల్" ప్రాతినిధ్యపద్ధతిద్వారాకూడ నాజీపార్టీ వారు అపారమగు ప్రాముఖ్యత పొందగల్గుచుండ, ఇక ఏకసభ్యనియోజకవర్గములుండుచో, ఇంకెంత సులభముగా, త్వరితముగా, నాజీపార్టీవా రిదివరకర్ మంత్రివర్గముల స్థాపించియుందురో ?

క్రీ. శ. 1932 సంవత్సరం జూలైమాసమందు, జరిగిన "ర్రెష్‌టాగ్" యెన్నికలందు, ప్రజానాయకులు ఎంతోహడావడిపొందిరి. స్త్రీలు, పురుషులు "నాజీ" పార్టీతరపున అత్యమితముగా ప్రచారమొనర్చిరి. ధనికులు, భూస్వాములు, వార్తాపత్రికలు, విద్యావంతులందరు, పట్టుపట్టి 'నాజీ' పార్టీ తర