పుట:Adhunikarajyanga025633mbp.pdf/150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఖ్యాకులు విద్యావిహీనులైయుండుటవలనను, విద్యావంతులకే ఓటులనిమ్మనుచో ఇప్పటికే వోటుహక్కుబొందినవారు, వోటులేనివారగుట తటస్థించును. అటులగాక, శిస్తుచెల్లించువారికే వోటులనిచ్చుచు, చదువుకొన్నవారికికూడ వోటుహక్కు నివ్వమనుచో, ఇప్పటికంటె మరికొందరికి వోటుహక్కురావచ్చును. ఈ విధమగు భేదముల ననేకము కల్పించుచు, ప్రజలలో కొందరికి వోటు లేకుండా జేయుటకు బదులు అందరికి వోటునిచ్చి, ఎల్లరకు చదువుటకు వ్రాయుటకు శక్తికల్గు సదుపాయముల కల్గించుట రాజ్యాంగములకు పాడిగదా !

రాజకీయాధికారములను దేశోపయోగకరముగా, ప్రజోపయోగకరముగా నుపయోగింప వలసియున్నది కనుక, వోటరులందరు చదువరులై రాచకీయానుభవముబొందినవారైయుండుట లాభకరము. కాని, చదువరులైన వారందరికి రాచకీయానుభవము కల్గుటలేదుగదా ! వోటుబొంది, ఎన్నికలందు పాల్గొని, రాచకీయవ్యవహారముల గమనించుచున్ననే, రాచకీయానుభవము కలుగగలదు. కనుక, చదువరులు కాకున్నను, మనప్రజలు వోటుహక్కుబొంది, రాచకీయానుభవము పొందుట కవకాశము సంపాదించుకొందురు. నిర్భంధ ప్రారంభవిద్య, వయోజనవిద్యావిధానముల రాజ్యాంహమేర్పరచుచో కొలదికాలముననే ఎల్లరు చదువరులగుట సుకరము. అంతియేకాని, ఎల్లరు చదువరులైననే వోటుహక్కు ప్రసా