పుట:Adhunikarajyanga025633mbp.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దించబడునని వాదించుట భావ్యముకాదు. మరియు చదువరులైనవారికే వోటుహక్కు యివ్వబడునని యేర్పాటుచేయుచో ప్రభుత్వోద్యోగులకు, వారిపై యధికారము వహించుమంత్రులకు ఎవ్వరికి వోటునివ్వవచ్చును, ఎవ్వరి కది యివ్వరా దను విచక్షణాధికారము కల్గును. ఇందువలన అనేక యిబ్బందులు కల్గుట అసాధారణముకాదు. అమెరికాలోని దక్షిణరాష్ట్రములందు విద్యావంతులైన వారికే వోటు నివ్వవలె నను నియమముండుటవలన, తెల్లవారు, నీగ్రోజాతివారిలో ననేకులకు, అన్యాయముగా వోటుహక్కు నివ్వనిరాకరింపకల్గుచున్నారు. రాచకీయానుభవ మంతగా లేని మనదేశమం దింకా నెన్నియో యిబ్బందులుకల్గును. ఇట్టికష్టములు కలుగకుండుటకై అనుభవరీత్యా, రాచకీయవిజ్ఞానము చదువరులు కాని వారికికూడ కల్గుననినమ్మి, బాల్కనురాష్ట్రములందును, ఇటలీ, స్పెయినుదేశములందును నిర్బంధప్రారంభవిద్యావిధానము యీమధ్యనే యేర్పరచబడినను, వోటరులలో అనేకు లిప్పటికిని చదువురానివారున్నను, ప్రజలెల్లరికి వోటుహక్కు ప్రసాదించబడినది.

చదివినవారైనను, చదువని వారైనను ఎల్లరకు రాజ్యాంగవ్యవహారములవలన కల్గు అవసరములు అనుభవనీయమగును. ప్రజలందరకు, తమప్రభుత్వ మెటులనడుపదగునో విచారించుట కవకాశ మగత్యము. వారెల్లరికి, తమకు రాజ్యాంగము వలన యెట్టిలాభములు కలుగవలయునో, దైవసం