పుట:Adhunikarajyanga025633mbp.pdf/149

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రసాధించుట ధర్మమని వాదించిరి. వోటర్ల జాబితాల తయారుచేయుటలోను, ఎన్నికలజరపుటలోను, ఖర్చు, కష్టము హెచ్చగునని వారికి తెలియకపోలేదు. కాని ప్రజాస్వామికరాజ్యము ప్రజలయభివృద్ధికై జరుపబడవలయునన్న ఇంతమాత్రము ఖర్చునకు, కష్టమునకు తయారై యుండవలెనని వారు సంతృప్తికరమగు సమాధానమిచ్చిరి.

స్త్రీపురుషభేదములను, ధనికులు నిర్ధనికు లనుభేదముల గమనించకున్నను, చదువుకున్నవారు, చదువులేనివారను భేదమైన కల్పించి, చదువుకున్న వారికే వోటుహక్కు నిచ్చుట యుక్తమని కొందరు వాదించుచున్నారు. శ్రీజాను స్టూవర్టుమిల్లుగారు, చదువుకున్నవారందరి కొక్కొక్కరికి, ఒక్కొక్కవోటునిచ్చి, విద్యాధికులైన ప్రతివారికి మరొక్క వోటునిచ్చుట మంచిదనికూడ వాదించిరి. శ్రీ లార్డు బీకన్సుఫీల్డుగారు, తమ రాజ్యాంగ సంస్కరణపు బిల్లునందు, ఇటులనే విద్యాధికులైనవారికి హెచ్చువోటులు బొందు అర్హత నేర్పరచ బ్రయత్నించిరి. లోధియనుకమిటీవారును శ్రీ అనిబిసెంటమ్మ గారి కామనువెల్తుకమిటీవారును, తదితరుల మధ్య, ఆస్థియున్నందులకే వోటుల పంచియిడినను, విద్యావంతులైన వారికిమాత్రము వోటుల నివ్వవలయునని సూచించిరి. కాని, ఏవిధముగ జూచినను, మనదేశమందు అల్పసంఖ్యాకులే చదువరులైయుండుటవలనను, వోటరులం దధికసం