పుట:Adhunikarajyanga025633mbp.pdf/148

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కార్యనిర్వాహణత యందుకాని యేమిభేదము కన్గొనగలము ? ఎందును భేదించని ప్రజలయందు, నామమాత్రపు ఆస్థికల్గి శిస్తు చెల్లింపగల్గు శక్తినిబట్టి కొందరిని వేరుజేసి, వారికే వోటుహక్కు నిచ్చుట న్యాయమా ? మనదేశమునే దృష్టాంతముగ గైకొనుచో, విద్యావిహీనులు, వోటు లేనివారియందెట్లుకలదో, వోటరులందును కలదు. రాచకీయానుభవరహితులు, ఇరుపక్షములందును కొల్లలుగాగలరు. ఇరుపక్షములకును, రాజకీయాధికారము, దానివలనకల్గులాభ మేమాత్రమైన యుండుచో, అవసరమైయున్నది. రాజ్యాంగ వ్యవహారముల వలనకల్గుసాధక భాధకములవలన, వోటరులవలెనే, వోటులేనివారును, లాభనష్టముల బొందవలసియుండును. జాతీయగౌరవరక్షణార్థమై, ఇరుపక్షములును ధనప్రాణముల ధారవోయవలసి యున్నారు. జాతీయజీవనము సిరిసంపదలు, సుఖసంతోషప్రదముగా నుండవలయునన్న, బీదలు, ధనికులెల్లరు తమతమ శక్తికొలది, స్వార్ధత్యాగము చేసి, రాజ్యాంగసేవ చేయవలసియున్నది. ఇట్టి పరిస్థితులందు, తుట్టతుదిదగు, ప్రాధమికమగు, రాజ్యాంగహక్కు, వోటుహక్కులు, ప్రజలలో ధనికులకు, శిస్తుచెల్లించువారికి మాత్రమొసంగి, మిగిలినవారికి నిరాకరించుట న్యాయమా ? కనుకనే నెహ్రూకమిటీవారు స్త్రీపురుషభేదము మాని, ధనికులు, నిర్ధనికులను భేదముల మాని యుక్తవయస్కులగు ప్రజలెల్లరకు వోటు హక్కు