పుట:Adhunikarajyanga025633mbp.pdf/141

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కప్పుడే, వారిని చంపెడివారు. కనుకనే, శాసననిర్మాణము, గ్రీసునందు దుర్ఘటమైన కార్యమై యుండెను.

రోమునందును ఇటులనే శాసననిర్మాణకులన్న ప్రజలును, పెట్రిషియనులును భయపడుచుండిరి. ఎప్పుడు రాజ్యాంగమును తల్లక్రిందులుచేయు శాసనముల సేనానాయకుడు ప్రతిపాదించి, నిర్మించునోయని వారు జాగ్రత్తపడుచుండిరి. కాననే, శ్రీగ్రాకసు (Gracchus) సోదరులిద్దరిని, శాసనముల నిర్మాణమునందు శ్రద్ధవహించిరను ద్వేషముతో, పెట్రిషియనులు కొందరు దుర్మార్గులగు పౌరులసాయముతో, పట్టపగటివేళ చిత్రవధ కావించియుండిరి.

ఇప్పుడట్లుగాక, శాసననిర్మాణమందు శ్రద్ధగైకొని, జయమందిన నాయకులెల్లయెడల పూజనీయులగుచున్నారు. సహగమనమును మాన్పించిన శ్రీ రాజారామమోహనుడు, విధవావివాహములు శాస్త్రసమ్మతమొనర్చిన శ్రీ విద్యాసాగరుడు, ప్రాధమికవిద్యా శాసనమును నిర్మింప ప్రయత్నించిన శ్రీ గోఖేలు, శారదాచట్ట కారకుడగు శ్రీ హరబిలాసుశారదాగారు, హిందూ దేవాదాయచట్టమును నిర్మించిన పానుగల్లురాజాగారు, మనదేశస్థుల యభివందనములకు పాత్రులగుచున్నారు.