పుట:Adhunikarajyanga025633mbp.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్సురాజ్యమందును, రోమన్ ప్రజాస్వామిక రాజ్యమందును, కార్యనిర్వాహకోద్యోగుల నెన్నుకొనుట, "పౌరసభ" యొక్కహక్కును, బాధ్యతయునై యుండెను. అటులనే యిప్పుడును, మంత్రాంగవర్గమువారు శాసనసభవారికి (అమెరికాయందుగాక) బాధ్యులైయున్నారు. కాని ఆకాలపు శాసనసభలకు కార్యనిర్వాహకవర్గముపై ఇప్పుడు సాధ్యమగుచున్నంత, ప్రాపకముకాని, ఆధిపత్యముకాని లభ్యపడెడిదికాదు. కారణము, ఇప్పటి రైల్వే పోస్టు తంతివార్తా సదుపాయము లాకాలమున లేకుండుటయు, వార్తాపత్రికా ప్రచారమప్పుడు లభ్యపడకుండుటయు నైయుండెను.

గ్రీసునందు, ముఖ్యముగా, ఏథెన్సునగరరాజ్యాంగమందు, 'పౌరసభ' లో శాసనమును ప్రతిపాదించి, సభవారిచే నంగీకరింపజేసిన నాయకుని, ఒక సంవత్సరములోపల, రాజ్యవిద్రోహిగానిందించి, న్యాయస్థానమందు విచారణకు దెచ్చుటకు ప్రతిపౌరునకు హక్కుయుండెడిది. కొన్నిరాజ్యములందిట్టి శాసనసంస్కరణముల ప్రతిపాదించునాయకుని కంఠమునకు వుచ్చువేసి, అటునిటు ప్రజలు పట్టుకొనియుండెడువారు. ఆయనసంస్కరణ, పౌరసభవారిచే నంగీకరింపబడుచో, వుచ్చునుండి వెల్వడి, సురక్షితుడై, ప్రజలచే భూషింపబడెడువాడు. అదృష్టముచాలక, వారిసంస్కరణ వీగిపోవుచో, అటునిటునున్న ప్రజలు ఆయుచ్చును బిగలాగి, అప్పటి