పుట:Adhunikarajyanga025633mbp.pdf/142

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దానిపేరుసూచించునటులనే శాసనసభ, శాసనముల నిర్మించుటకుగా యేర్పరుపబడుచున్నది. ఇంగ్లీషువారి రాజ్యాంగపు టాచారముల సరిగాగ్రహించని, అమెరికారాజ్యాంగనిర్మాతలు, పురాతనపు గ్రీసు, రోమను రాజ్యాంగములందలి

శాసనసభా
ధర్మములు.

శాసనసభలనుమాత్రము గమనించి, తమ సమ్మేళనరాజ్యాంగపు, రాష్ట్రీయశాసనసభలకు, శాసననిర్మాణమే ప్రధానమగు ధర్మముగానిర్ణయించిన జాలుననుకొనిరి. శిస్తులు నంగీకరించుచు, ప్రధమమునుండియు, శాసనముల నిర్మించుచుండుట ఆచారమైయుండెను కనుక, అయ్యదికూడ శాసనసభయొక్క సాధారణధర్మములలో నొక్కటిగా పరిగణింపబడుచుండెను. ఇంగ్లాండునం దట్లుగాక, శాసననిర్మాణమేకాక, ప్రభుత్వమును అదుపుఆజ్ఞలందుంచి, మంత్రాంగవర్గమును విమర్శించుట, పెత్తనమందుంచుట, అసంతృప్తికరమగు మంత్రివర్గమును పదభ్రష్టత నొందించుట, పార్లమెంటు తన ధర్మముగా పరిగణించుచున్నది. అమెరికాయందు, కార్యనిర్వాహకవర్గపు టధ్యక్షుడగు ప్రెసిడెంటు ప్రజలచే సరాసరియెన్నుకొనబడి, శాసనసభపై తనయధికారమునకు, పదవికి ఆధారపడియుండడు. ఇంగ్లాండునందట్లుగాక, మంత్రివర్గము, పార్లమెంటునందు, అధిక సంఖ్యాకులకు జెందిన "మెజారిటీపార్టీ" సభ్యులవలన నిర్మింపబడి, మెజారిటీపార్టీవలన నిలబెట్టబడి, మెజారిటీపార్టీకి