పుట:Adhunikarajyanga025633mbp.pdf/132

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బంధించిన శాసనము చట్టవిరుద్ధమని వాదించినచో, ఆ శాసనము అక్రమమైనదగుచో చట్టవిరుద్ధమని తీర్మానించి, ఆశాసనముపై ఆధారపడియున్న వ్యాజ్యమును తిరస్కరించుటయే కోర్టువారిధర్మము.

కెనడాయందు సమ్మేళనరాజ్యాంగ మేర్పడినను, సమ్మేళనరాజ్యాంగపు శాసనములన్నిటిని విమర్శించి, అవకాశము కల్గినప్పుడెల్ల తమకుతోచిన శాసనముల చట్టవిరుద్ధములని ప్రకటించుటకు ప్రీవీకౌన్సిలువారికధికారము లేదు. ఏయధికారమువలన సభ్యరాష్ట్రములకొరకు రాజ్యాంగవిధానపుచట్టముచే ప్రత్యేకింపబడినవో వానికి భంగకరముగానుండు కేంద్రశాసనసభవారి శాసనములనే చట్టవిరుద్ధములని తీర్మానింప వీలగును. అటులనే దక్షిణాఫ్రికా రాజ్యాంగమందును, నీగ్రో ప్రజలకు ప్రసాదించిన హక్కులకు, రాష్ట్రీయశాసనసభల కొసంగినహక్కులకు భంగకరముగానుండు శాసనములను సమ్మేళనరాజ్యాంగపుపార్లమెం టంగీకరించుచో వానిని అంగీకరింపకుండానుండుటకు గవర్నరుజనరలున కధికారముకలదు. ఆతని యనుమతిపొందినపిమ్మటకూడ రాజు దాని కనుమతించక పోవచ్చును. రాజుగారు దాని కనుమతించినపిమ్మటనే ఆశాసనము అమలునకు వచ్చును. కాన అమలునకువచ్చిన శాసనములను చట్టవిరుద్ధమని ప్రకటించు అధికారము ఆదేశపు న్యాయస్థానములకు కొరవడియున్నది.