పుట:Adhunikarajyanga025633mbp.pdf/133

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జర్మనీయందు సమ్మేళనరాజ్యాంగ మేర్పరచబడినను సుప్రీముకోర్టువారికి సమ్మేళనరాజ్యాంగపు చట్టమునకు విరుద్ధముగానుండు సమ్మేళనరాజ్యాంగపు శాసనములు అక్రమములని తీర్మానించు యధికారము లేదు. రాష్ట్రీయశాసనములకును, సమ్మేళన శాసనములకును పరస్పరవైరుధ్య మేర్పడినచో సమ్మేళనశాసనములే ఆచరణ యోగ్యములు. కనుక, సమ్మేళనశాసనములకు వ్యతిరేకముగానుండు రాష్ట్రీయశాసనముల నన్నిటి చట్టవిరుద్ధములని తీర్మానించుయధికారముమాత్రము న్యాయస్థానములకు కలదు. ఆస్ట్రియాయందును, సమ్మేళన రాజ్యాంగపు శాసనముల ధిక్కరించుటకు న్యాయస్థానములకు హక్కు లేదు. ఆశాసనములు చట్టసమ్మతములా కావా యని విచారించుటకే వానికి అధికారము లేదు. కనుక, ఈమూడు రాజ్యాంగములందును (దక్షిణాఫ్రికా, జర్మనీ, ఆస్ట్రియా ) సమ్మేళనరాజ్యాంగపు శాసనసభకు, శాసననిర్మాణమందు ఇంగ్లాండుయొక్క పార్లమెంటునకువలెనే సంపూర్ణ స్వాతంత్ర్యముకలదు. ఆయాసమయముల ననుసరించి అవసరముల గమనించి, కేంద్రశాసనసభ లీదేశములందు, అగత్యమగు శాసనము నిర్మించనగును. శాసనముల నిర్మించువిధానములందే, తగురక్షణమార్గములు (రెఫరెండము, ప్రత్యేకపు మెజారిటీలు వగైరాలు) నిరూపింపపడుచున్నవి.