పుట:Adhunikarajyanga025633mbp.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐక్యరాజ్యాంగముయొక్క శాసనసభవారిశాసనములు పరమ ప్రామాణ్యములు. అయ్యవి "క్రమమైన వా, అక్రమమైనవా" అని విచారించుటకే న్యాయస్థానముల కర్హతలేదు. ఇట్టిపరిస్థితులు ఇంగ్లాండునందును, దక్షిణాఫ్రికాయందునుకలవు. కాని సమ్మేళనరాజ్యాంగములుకల్గిన అమెరికాయందును, ఆస్ట్రేలియాయందును, స్విట్జర్లాండునందును రాజ్యాంగవిధానపు చట్టము ననుసరించియే ఆయాసమ్మేళన రాజ్యాంగపు శాసనసభలు సభ్యరాష్ట్రీయశాసనసభలు, శాసనముల నిర్మించుచున్నవా? లేక వీనిశాసనములు ఆచట్టము నతిక్రమించుచున్నవా? యని విచారించి తీర్పులు చెప్పుయధికారము సుప్రీముకోర్టులకు కలదు. రాజ్యాంగవిధానపు చట్టమునకు అమెరికా సమ్మేళన రాజ్యాంగపు శాసనము విరుద్ధమైనదని తొమ్మిదిమంది సుప్రీముకోర్టుజడ్జీలలో ఐదుగు రభిప్రాయబడినచో, ఆశాసనము రద్దు కావలసినదే ! ఇట్లే తదితర దేశములందును సుప్రీముకోర్టులకు శాసనసభలపై యాధిపత్య మొసంగబడుచున్నది. కాని సమ్మేళనరాజ్యాంగమున సభ్యరాష్ట్రముల శాసనసభలు నిర్మించుశాసనములనెల్ల నీన్యాయస్థానములవారు ఎప్పటికప్పుడు చట్టసమ్మతములా కావా యని విచారించుచుండుట లేదు. సుప్రీముకోర్టువారి సమక్షమునకు ఏవివాదమైన తీర్పునకై వచ్చినచో, అందొక్కపార్టీవారు తమవివాదమునకు సం