పుట:Adhunikarajyanga025633mbp.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేమియునుండజాలదు. వీలున్నచో కెనడా, దక్షిణాఫ్రికాలందువలె విశాలమగు రాజ్యాధికారము, స్థానికసంస్థలకిచ్చిన శ్రేయమొనగూడును. రాజ్యాంగజీవితమందు కేంద్రప్రభుత్వము, రాష్ట్రీయప్రభుత్వములు, స్థానికస్వపరిపాలనాసంస్థల మధ్య ప్రభుత్వాధికారవిభజన మెట్లుచేయవలెనో, కాలావసరములబట్టియు, ప్రజలయిష్టాయిష్టములబట్టియు నిర్ణయింపనగును. కాని సాధ్యమైనంతవరకు రాష్ట్రీయ, స్థానికప్రభుత్వసంస్థలకే హెచ్చురాజ్యాధికార మొసంగి, తాను వానిపై పెత్తనముజేయుచు, రాజ్యాంగము సక్రమముగా, సంతృప్తికరముగా సాగునట్లు జూచుచుండుటయే కేంద్రప్రభుత్వమునకు యుక్తము.

సమ్మేళనరాజ్యాంగములందు న్యాయస్థానములు ప్రత్యేకప్రాముఖ్యత బొందుచున్నవి. ఐక్యరాజ్యాంగములందు

న్యాయస్థానముల
యొక్క బాధ్యత.

శాసనసభవారికే సంపూర్ణరాజ్యాధికారము చెందియుండుట వలన వానిపై నాధారపడియున్న మంత్రాంగవర్గముల చర్యలను ఆసభలే సమర్థించుకొనుచుండుటచే, ఆసభలయొక్క శాసనముల ధిక్కరించుటకుగాని, వానిచే బలపరుపబడుచుండు ప్రభుత్వములు శాసనసమ్మతముగా చేయుకార్యముల సక్రమములని శాసించుటకుగాని, న్యాయస్థానముల కధికారము లేదు.