పుట:Adhunikarajyanga025633mbp.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజుపాలించినను, అధ్యక్షునిక్రింద నున్నను ప్రభుత్వములో విశేషమైన భేదములుండవచ్చును. ఇంగ్లాండునందు ఒకే ప్రభుత్వము కలదు. మిగిలిన లోకల్ బోర్టులు, చిన్న సంస్థలు లండనులోనుండు ప్రభుత్వముచే నిర్మింపబడినవి. కనుక వానిని (Subordinate) తాబేదారు సంస్థలని చెప్పుదురు. జర్మనీలో కేంద్రప్రభుత్వము వేరు. సమ్మేళనరాజ్యములోచేరిన వివిధరాష్ట్రముల ప్రభుత్వము వేరు. అనగా ప్రషియా, బవేరియా, సేక్సనీ మొదలగు చిన్న రాష్ట్రములు వానివాని పరిపాలనాక్రమమును మార్చక పూర్వమువలెనే జీవముతో నున్నవి. కాని 1914 సంవత్సరమునకుముందు జర్మనీలోను, ఇంగ్లాండునందును రాజులే పరిపాలకులుగానుండిరి. అమెరికాలోను, ఫ్రాంసుదేశములలోను అధ్యక్షుడు అధిపతిగా నుండెను. కాని అమెరికాలో 48 చిన్న రాష్ట్రములు కలిసి సమ్మేళనరాజ్యమును ఏర్పరచికొనెను. కనుక అక్కడ కేంద్రప్రభుత్వము 48 చిన్న ప్రభుత్వములును గలవు. కాని ఫ్రాంసులో నొకేప్రభుత్వముకలదు. దీనికి (Unitary State) ఐక్యరాజ్యాంగమందురు.

కొన్ని రాజ్యములలో మంత్రులు ప్రజలచే నెన్నుకోబడు శాసనసభ్యులకు జవాబుదారులుగాను, బాధ్యులుగాను ఉండి శాసనసభలో మెజారిటీపార్టీలో ముఖ్యులుగా నుండి రాజ్యమును చక్కగా నడిపించుచు నుందురు. ఇంగ్లాండులోను,