పుట:Adhunikarajyanga025633mbp.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఫ్రారాంసులోను, ఆస్ట్రేలియా, ఇటలీమున్నగు దేశములలోను ఈరీతిగా జరుగుచున్నది. ముఖ్యమంత్రియే ప్రభుత్వమునకు అధిపతి. రాజుగాని, అధ్యక్షుడుగాని ముఖ్యమంత్రికి అనుగుణముగా నడుపుచు శాసనసభలు తీర్మానించిన అన్ని చట్టములకును సంతకముచేయుచు నుండవలెను. కాని అమెరికాలోను, మరికొన్నిదేశములలోను, శాసనసభలకు మంత్రులకు ఏమియు సంబంధముండదు. దీనిని (Independent Executive) స్వతంత్రపుమంత్రివర్గము అని అందురు. వీరు అధ్యక్షునికే జవాబుదారులు. ప్రస్తుతము హిందూదేశములో కేంద్రప్రభుత్వమందు మంత్రులు వైస్రాయిగారికే జవాబుదారులు గాని శాసనసభలకుగారు.

ఇంకను కొన్నిదేశములందు ప్రభుత్వమునకుజెందిన వారికి వేరు లాకోర్టులును, సామాన్యప్రజలకు వేరు లాకోర్టులును గలవు. ఫ్రాన్సుమున్నగు ఐరోపాఖండపు దేశములలో (Administrative Law) ప్రభుత్వమువారిచే నిర్మింపబడిన లా కలదు. మామూలు సివిల్ లా, సామాన్యప్రజలకు జెందును. కాని ఇంగ్లాండు అమెరికా మొదలగు దేశములలో ప్రభుత్వపు నౌకర్లకును సామాన్యులకును ఒకే "లా' (Common Law) అనగా సివిల్ న్యాయసూత్రములే వర్తించును. ముఖ్యమంత్రినైనను సాధారణమైన కోర్టులో విచారణ చేయవచ్చును.