పుట:Adhunikarajyanga025633mbp.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లమగునవియై, అప్పటికి తెలిసిన ప్రపంచమంతను వ్యాపించి, అభివృద్ధిని జెంది క్రమముగా క్షీణించినవి. తరువాత జర్మనులు, ఫ్రాంకులు, ట్యూటనులు మొదలగు జనసమూహములు ఆయాదేశములలోవచ్చి నివాసమునేర్పరచుకొని ప్రస్తుతపు రాజ్యాంగ సంస్థలను నిర్మించిరి.

ఈ రాష్ట్రములే మిక్కిలి ఉన్నతస్థితియందు ప్రస్తుతము ఉన్నవి. ఈరాష్ట్రములు వివిధరీతులుగా, చిత్ర విచిత్రరూపు రేఖలతో విరాజిల్లుచున్నవి. ఈరాజ్యములను మనము అనేక విధములుగా విభజింపవచ్చును.

కొన్ని రాజ్యములు రాజులచే పాలింపబడుచు మన హిందూదేశములోని స్వదేశసంస్థాములవలె నిరంకుశ ప్రభుత్వములనబడుచున్నవి. యీరోషిమహాసంగ్రామమునకు ముందు రషియాదేశము ఈరీతిగానే పాలింపబడుచుండెడిది. కాని కొన్ని రాజ్యములలో అనగా ఇంగ్లాండు, ఇటలీ మొదలగువానిలో రాజునామమాత్రముగా నుండి, ప్రభుత్వము ప్రజలచే నెన్నుకొనబడు మంత్రులచే చేయించుచు, తాను నిస్పక్షపాతగానుండి రాజ్యము చేయుచుండెను. దీనిని (Limited Monarchy) నియమితమగు ఏక ఛత్రాధిపత్యమందురు. మరికొన్ని దేశములలో రాజు లేనే లేడు. వీనిని రిపబ్లికు లందురు. అమెరికా, ఫ్రాంసు, చైనా మొదలగువానిలో ఎన్నుకొనబడిన (President) అధ్యక్షుడు రాజ్యమునకు అధిపతియై యుండును.