పుట:Adhunikarajyanga025633mbp.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ళనమందు జేరుటకద్దు గాని, అస్వతంత్రతజెంది, కేంద్రప్రభుత్వాధికారమునకు లోనై, స్థానిక స్వపరిపాలనాధికారము బొందిన రాష్ట్రములకు, సభ్యరాష్ట్రముల రాజ్యాంగాధికారముల నొసంగుటవలన, సమ్మేళనరాజ్యాంగమున బలహీన పరచుటయు, దేశపు రాజ్యాంగసౌష్టతను దూరమొనర్చుటయు తప్ప, మరేయే యితరలాభమును చేకూరజాలదు. సర్వస్వతంత్రత బొందియున్న రాజ్యములు, తమ వ్యక్తిత్వమును, స్వయం నిర్ణయతాధికారమును పూర్తిగా బోగొట్టుకొనుట కిష్టమొందక, సాముదాయక సహకారపరంపరవలన కలుగు లాభముల బొందగోరుచో, సమ్మేళనరాజ్యాంగము, ఏర్పరుపబడును. మన స్వదేశసంస్థానములు, పూర్తిగా కేంద్రప్రభుత్వమునకు లొంగిపోవుటకు యిచ్చగించుట లేదు. కాని మన కేంద్రప్రభుత్వమునందు చేరి, మన రాష్ట్రములన్నిటితో సహకార మొనర్చి, భారతదేశపు రాజ్యాంగాధికారమందు కొంతభాగము తాము బొంది, తన్మూలమున కల్గులాభముల బొందవలయునని కుతూహలపడుచున్నవి. మన రాష్ట్రము లిప్పుడు, కేంద్రప్రభుత్వమునకు పూర్తిగా లొంగియుండి, ఆప్రభుత్వపు టాజ్ఞలకు బద్ధములై, తమ రాజ్యాధికారముల నడుపుకొనుచున్నవి. అనగా, మన బ్రిటిషు ఇండియాయందు, ఐక్యరాజ్యాంగముకలదు. ఆయైక్యరాజ్యాంగాభివృద్ధి స్వదేశ సంస్థానములకు యిష్టములేదు. తమ కిప్పుడు, తమదేశము