పుట:Adhunikarajyanga025633mbp.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముల నిప్పటివలె కేంద్రప్రభుత్వమునుండి పొందుటకుమారు, తామే, కేంద్రప్రభుత్వమున కెట్టియధికారముల నొసంగవలయునో విచారించుస్థితికి రావలయునని, ముస్లిమునాయకులు వాదించుచున్నారు. ఇప్పటివరకు స్వతంత్రత బొందియున్న స్వదేశ సంస్థానములు, తమయైక్యతను కొంతవరకు తగ్గించుకొని, సమ్మేళనరాజ్యాంగమునందు జేరుటయుక్తమని కొందరు వాదించుచున్నారు. క్రమముగా సమ్మేళనరాజ్యాంగము నేర్పరచుటయే మనదేశమునకు లాభకరమనియు, శరణ్యమనియు రాజకీయజ్ఞు లనేకులు వాదించుచున్నారు.

కొందరు రాజకీయనాయకులు (వారిలో ముఖ్యులు శ్రీనివాసశాస్త్రి, జిన్నాగారలు) ఇప్పటికిప్పుడే అఖిలభారత దేశమునకు సమ్మేళనరాజ్యాంగము లేకున్నను ఫరవాలేదనియు, ఒక వేళ సమ్మేళనమేర్పచినను, కేంద్రప్రభుత్వమునకే, సభ్యప్రభుత్వముల కొసంగబడిన యధికారములు పోగా, మిగిలిన రాజ్యాంగాధికార మొసంగుట మేలనియు వాదించుచున్నారు. ఈవాదము, చరిత్రాధారమగు దృష్టాంతములతో బలపడుచున్నది. ఇప్పటి బ్రిటిషుదేశపు ప్రభుత్వము, మనలోని ముస్లిముల ప్రీత్యర్థమై, కేంద్రప్రభుత్వమునకు లోబడియున్న రాష్ట్రీయప్రభుత్వములకు, సభ్యరాష్ట్రస్తానమొసంగ నిచ్చగించుచున్నది. కాని ఇదివరకే సర్వస్వతంత్రతబొందియుండిన రాజ్యములు తమ సాముదాయక లాభములకై సమ్మే