పుట:Adhunikarajyanga025633mbp.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లందు, తమ ప్రజలపైయున్న సంపూర్ణ రాజ్యాధికారము చెక్కుచెదరకుండ నుండవలెను. కాని, తమ కిష్టమగునంతవరకు, కొన్ని యధికారములను, సమ్మేళనరాజ్యాంగమున కిచ్చుటకు తయారైయున్నవి. ఇచ్చువారు తామై పుచ్చుకొనునది సమ్మేళనరాజ్యాంగమైయుండుట వారి కిష్టము. సమ్మేళన రాజ్యాంగము లెప్పుడైనను, రాజ్యాధికారమును కొంతవరకుగాని, పూర్తిగా గాని యివ్వకల్గు రాజ్యములచేత యేర్పరుపబడును కాని, పుచ్చుకొను స్థానమందున్న రాష్ట్రములద్వారా యింతవర కెచ్చటను యేర్పడలేదు. కనుకనే, మనవారు కొందరు, సమ్మేళనరాజ్యాంగ మేర్పడినను, మనరాష్ట్రములు, పుచ్చుకొనే స్థితియందుండుట మంచిదనియు, వాని కివ్వబడిన యధికారములు పోగా, మిగిలిన రాజ్యాధికారమంతయు సమ్మేళనరాజ్యాంగమునకు చెందవలెనని వాదించుచున్నారు.

మనరాష్ట్రము లిప్పు డెట్టి స్థితియందున్నవో, అట్టి 'పుచ్చుకొను' స్థితియందు, సామంతస్వామికమందే, కెనడా దేశమందును,

దక్షిణాఫ్రికా కెనడా
రాజ్యాంగములు.

దక్షిణాఫ్రికాదేశమందును, రాష్ట్రీయప్రభుత్వములు కలవు. ఆదేశములకు సమ్మేళన రాజ్యాంగము లేర్పరచబడెను. కాని ఆరాజ్యాంగములు, అమెరికా, ఆస్ట్రేలియా రాజ్యాంగములనుండి, ముఖ్యవిషయములందె, తీవ్రముగా భేదించుచున్నవి. అమెరికా, ఆస్ట్రేలియా దేశములందు, ఇచ్చుస్థానమందు రాష్ట్రీ