పుట:Adhunikarajyanga025633mbp.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమ్మేళన రాజ్యాంగమేర్పడుటతోడనే, సభ్యరాజ్యాంగములకు మించి, మరొక రాజ్యాంగ సంస్థ యేర్పడుచున్నది. అంతటితో సభ్యరాజ్యాంగములకు తమపూర్వపు ఐక్యతబోవుచున్నది. సమ్మేళనరాజ్యాంగమున, ఐక్యరాజ్యాంగములకుండు సంపూర్ణత సంపాదితము కాజాలదు.

ఆదిమకాలమందు అన్నిదేశములందునను కుటుంబపరిపాలనమునుండి, 'కుదురు'ల పెత్తనమువరకు, అనేక 'కుదురుల'

ఆదిమకాలము.

సమూహమునుండి జాతుల సమ్మేళనమువరకు, క్రమముగా అనేకరీతుల అనేక పరిస్థితులందు, సమ్మేళనములు జరుగుచునేయుండెను. కాలావసరములబట్టి కుటుంబములు కుదురులందు, కుదురులు జాతులందు, జాతులు దేశస్థులందు దాదాపుగా ఐక్యత జెందిపోవుట తటస్థించుచుండెను. కొన్నిదేశములం దిట్టి వివిధసంఘములు, జాతులు సంపూర్ణైక్యత బొందుటచే, నిరంకుశ రాజ్యపాలనమేర్పడుటయు సాధ్యమగుచుండెను. ఆయానిరంకుశ పాలకుల యిష్టముననుసరించి, వివిధకుటుంబముల, జాతుల యొక్క సాంఘిక, ఆర్థికప్రత్యేకత నిల్పబడుచుండెను. చైనా, భారతదేశములందుమాత్రము రాచకీయమునందుకూడ, సంపూర్ణఐక్యత సంభవించక, సమ్మేళన రాజ్యాంగమే యేర్పడెను. వివిధపంవాయతులు, రాజులమధ్య రాజ్యాధికారము ఆచారమాత్రముగ ధర్మశాస్త్రబద్ధముగా విభజింపబడియుం