పుట:Adhunikarajyanga025633mbp.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డెను. పంచాయతీల హక్కుల వమ్ముజేయుట కేరాజునకు ధర్మశాస్త్రమునకు బద్ధుడై యుండినచో, అధికారములేకుండెను. రాజు తనకు నిర్ణీతమైన రాజ్యాంగాధికారమును ప్రజానాయకులసలహాలపై సహకారముతో నడుపవలసియుండెను. ఇటులనే పాశ్చాత్యదేశములందును, ఆశియాఖండమునుండి దండయాత్రలపై వెళ్ళి రాజ్యాధికారము సంపాదించుకొనిన జాతులందు (ఫ్రాంకులు, ఆస్ట్రోగాత్‌లు, మంగోలులు వగైరాలు) 'కుదురుల' నాయకులు, జాతులనాయకుల సలహాలపైననే, సహకారముతోడనే, రాజులు రాజ్యపాలన మొనర్చుచుండిరి. క్రమముగ పట్టణములు గ్రామముల నిర్మించుకొని, దేశజీవితమును స్థిరపరచుకొన్న పిదపకూడ, వివిధ 'కుదురు'ల, జాతుల సమ్మేళనముల ద్వారానే గ్రీసుదేశపు నగర ప్రజాస్వామిక రాజ్యాంగములు, రోమన్‌నగర ప్రజాస్వామిక రాజ్యాంగము యేర్పరచబడెను. కాని క్రమముగా ఈ సమ్మేళనము లందు జేరినజాతులు తమ ప్రత్యేక రాజ్యాధికారముల బోగొట్టుకొని ప్రధాన రాజ్యాంగమందు తమవ్యక్తిత్వమును అంతర్గర్భిత మొనర్చి, 'ఐక్యరాజ్యాంగము'ను కలుగజేయుచుండిరి. కనుకనే గ్రీసుదేశమందలి వివిధనగర రాజ్యాంగములను సమ్మేళన రాజ్యాంగమందు జేర్చుటకు ఆకాలపు రాజకీయ నాయకులు రాజనీతిజ్ఞులు అంగీకరింపరైరి. వివిధజాతుల ఒక్కరాజ్యమందు, వివిధరాజ్యములు ఒక్కసామ్రాజ్యమందు సంపూ