పుట:Abraham Lincoln (Telugu).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మెలసి చదువుచుందురు. లింకనుగూడ దగువిధమున విద్య గఱపిన నాబి గొప్పవా డగునని గుర్తింప నారంభించెను.

1819-20 వ సంవత్సరమునందు బ్రాప్తించిన గొప్పలాభ మాబికి మాఱుదల్లిరాక యొక్కటియగాదు. క్రొత్తబడి యొకటి దమ కుటీరమునకు రెండుమైళ్ల దూరమున నుంచబడెను. తల్లిదండ్రు లిద్దఱు నాబీని నచటికి బంప నిశ్చయించిరి.

జనులు విశేషముగ వచ్చి చేరియుండిరి. వారి బిడ్డల కొక విద్యాలయము గావలసివచ్చెను. కావున వా రొక పూరి గుడిసె నిర్మించి యుంచిరి. చక్కగ మనుష్యుడు నిలిచిన నాగుడిసె కప్పు దలదాకుచుండును. గోడ కన్నములే గవాక్షము లాయెను. మంట సేసికొనుట కొక ప్రక్కన ప్రొయి యొకటి సిద్ధముగ నుండెను. ఇట్టి సరస్వతీ సదనమున నాబ్రహాము గణితము నేర్చుకొనుటకు బంపబడెను. అతనితండ్రి వెదకివెదకి యొక ప్రాత గణిత పుస్తుకము నొకదానిని దెచ్చి యిచ్చెను. తల్లి క్రొత్త యుడుపుల గుట్టి యా బ్రహామునకు దొడగ నిచ్చెను.

అచట నాబి గణితమున బ్రవీణు డాయెను. వర్ణక్రమమున నద్భుతశక్తి సంపాదించెను. అయిన నప్పటి విద్యాలయము లన్నిటివలె నదియును గొన్ని వారములలోపల నగోచర మాయెను.