పుట:Abraham Lincoln (Telugu).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూమి చదునుచేసి కవాటములును గవాక్షములును దీయించి కుర్చీలు బల్లలు దగువిధముగ నిలిపి యాగృహమునకు గ్రొత్త వన్నెదెచ్చెను. కొద్దిదినములలోపల నామె తెచ్చిన కాంతి జూచిన నామె సమర్థతయు, కార్య నిర్వాహకత్వమును దేట పడియెను.

ఇంతటిబుద్ధికౌశల్యమును, విద్యాసంపత్తియు, గల మాఱుదల్లి యింటి నలంకరించిన దిన మాబ్రహామునకు మహా సుదినము. ఆమె రాక యతనికి దల్లి మరణ మాదిగ నెప్పుడు లేని హర్ష మొసగెను. ఆమెను, ఆమె బిడ్డలను సంతోషముతో జేర్చుకొని వారిని మిక్కిలి యాదరణ ప్రేమతో స్వంతతల్లి సోదరుల తెఱగుననే గణింప దొడగెను. మొదట వచ్చినప్పు డా బిడ్డల యుడుపులు ముద్దుగ నుండెను. ఆబ్రహా ముడుపులును మాఱుదల్లి రాకచే నాప్రకారము సవరింపబడెను. ఆ బిడ్డ లాబ్రహామునకు సంపూర్ణ సోదరభావము చూపుటయేగాక యతని ప్రౌఢిమ కద్భుత మంది యతని గౌరవిచుచుందురు.

"సాలీ" యాబ్రహాముపై మిక్కిలి దయగల్గి ప్రేమతో బెంచుచుండెను. అతని విద్యాభ్యాసమున కామె మిక్కిలి తోడ్పడెను. అతడును జీవించినంతకాల మామెయం దనురాగము గనుపఱచుచుండును. ఆపె బిడ్డలును ఆబియు గలసి