పుట:Abraham Lincoln (Telugu).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రీయాజమాన్యములేని గృహము శ్రీ దక్కియుండు ననుటకు సందియము వలదు. బిడ్డల యుడుపులు చినిగి వ్రేలాడుటకు బ్రారంభించెను. ఇంట వస్తువులుచూడ నింపులు గురుపించువిధమున నుండుట దూర మాయెను. పూరిగుడిసె నైనను వైకుంఠము చేయగల్గు నారీరత్నము లేమిజేసి యిల్లే యడవి యాయెను. కావున థామసులింకను భార్యాన్వేషణార్థము వెడలెను. కెంటకీ సీమసొచ్చి పూర్వము దన్ను వరించుటకు మారుగ జాన్‌సన్ అను నతని వరించి విధవ యై యుండిన "సాలీబుష్" అను నామెను వివాహ మాడెను. ఆమె కప్పటికి ముగ్గురు బిడ్డలు: జాన్, సారా, మటిల్డా. ఆ కాలమున కామె ధనవంతురాలు. మూడుకాండ్ల గట్టి యామె సామాను, ఆఱు కుర్చీలు, ఒకబీరువ, కొన్ని పెట్టెలు, బల్లలు, పరుపులు మొదలగునవి, ఇందియానాకు సాగింపబడెను. ఆబ్రహామున కివన్నియు నద్భుతము గలుగజేసెను. అదివఱకెన్నడు నంత సామాను దా జూచియెఱుగడు. మాఱుదల్లి పై నతని కప్పుడ ప్రేమాంకురంబులు చూపట్టెను.

"సాలీ", "నాంసీ" కంటె విశేషము విద్యాపరిశ్రమ గలది. దేహము గృహము మిక్కిలి యింపుగను శుభ్రముగను ఉంచుకొన బ్రయత్నించుచుండును. కావున దా లింకను కుటీరము సేరినవెంటనె దాని జక్క బెట్ట మొదలిడెను. నడు