పుట:Abraham Lincoln (Telugu).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆబ్రహా మిక రెండుతరుణముల మాత్రమె పాఠశాలల ముఖము సూచెను. మొత్తముమీద నతడు విద్యాలయములలోనుండినకాల మొక సంవత్సరమునకు మించదు. ఏ బడికి బోయినను, ఏయుపాధ్యాయునివద్ద నభ్యసించినను, ఆబ్రహా మచ్చట గల్గువిద్య నంతయు సంగ్రహింపక మరలినది లేదు. గురువుకు బ్రియత్వ మింత పెనచినవారును లేరు. అతని గుణాధిక్యము వెల్లడిసేయు నంశములు గిన్ని యిట వివరించెదము.

ఆబి క్రాఫొర్డు గారి బడిలో జదువుచుండెను. అచట నొక గోడకు బంధింపబడిన దుప్పికొ మ్మొకనాడు విఱిగిపడి యుండెను. పంతులవా రదిచూచి బాలురలో నొక్కరు డాపని సేసియుండనోపు నని తలంచి మఱునాడు వా రందఱు చేరినతరువాత 'ఎవ రీకొమ్ము విఱచి'రని యడిగెను. దానికి బ్రత్యుత్తరముగ నాబ్రహాము "అయ్యా! నే విఱచితిని. తెలియక దాని బట్టి యూగితిని. అది విరిగె. నే తప్పుసేయ నెంచ నైతి"" నని నిజము పలికి యుపాధ్యాయుని మెప్పు వడసెను. ఆత డెప్పు డనృత మాడినది లేదు. తన త ప్పితరుల పై నిడ జూచినది లేదు.

కూర్మము బట్టి వేధించుట యా బడిపిల్లలకు సర్వసాధారణము. దాని నణచివేయ నాబ్రహా మెన్నోప్రయత్నములు చేసెను. ఉపన్యాసములు వ్రాయుట యాపాఠశాలయం దాచా