పుట:Abraham Lincoln (Telugu).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూకతతో జదువుచు వచ్చెను. నీతికథామంజరి యతనికి దొరకిన రెండుసంవత్సరములలోపల మరి రెండుపుస్తుకములు లభించెను.

అందొకటి 'వాషింగ్టను' జీవితము. అతడు యునైటెడ్ స్టేట్సు మొదటి దేశాధ్యక్షుడు. స్వాతంత్ర్యార్థ యుద్ధమం దతడు ప్రధాన సేనానాయకుడుగ నుండెను. అతడు "యునైటెడ్‌స్టేట్స్‌తండ్రి" యని ప్రసిద్ధిగాంచెను. అతని చరిత్రము మా చదువరులు శీఘ్రకాలములోనె చదువ గలుగుదురు గాక. ఆబ్రహాములింకను బాలుడుగ నుండగ నా జీతమును మాటిమాటికి జదువుచుండెను. దాని ప్రతులు సంపాదించుట కై యాబ్రహాము పడినపా ట్లనేకములు గలవు. వీ మను నతడు వ్రాసిన చరిత్ర మొకటి యా ప్రాంతముల జోషియా వద్ద నున్నదని విని యతని దర్శించి దాని గొనితేబోయెను. పుస్తుకము పెరవుగొనువారు వాని మరల నియ్య కుండుట పలుమారు తటస్థించుచుండును. ఇచ్చినను విరూప మొందజేసి యుండుట సర్వసాధారణము. ఇతరుల సొత్తు దమసొత్తుంబోలె చూచుకొని జాగ్రత్త పుచ్చుకొనకుండుట యిద్దానికి గారణ మగుచున్నది. ఇట్టి యజాగ్రత్తవలన ననేకవిద్యాశాలలును, బుస్తుక భాండాగారములును, అనేకగ్రంథముల గోలు పోయినవి. అయిన నాబ్రహాము మేమరుపాటునకు లోబడు