పుట:Abraham Lincoln (Telugu).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దను వ్రాయుచుండును. తండ్రి దీని జూచి కొంత కనలెను. అయిన గుమారు సామర్థ్యమువల్ల నగు సంతోష మాకోపము నణచివేయుచుండెను.

కొన్నిదినములమీదట నొక పొలమున నాబియు నతని తండ్రియు దున్నుచుండ నచటి కొక స్నేహితు డేతెంచెను. ఏతెంచి మట్టిలో జెక్కిన కొన్ని యక్షరముల గాంచి యవి యెవరు వ్రాసిరని యడిగెను. ఆబ్రహాము చిఱునగవున నూరకుండెను. అతని తండ్రి 'యాబి కార్యమై యుండును, మరే మున్న' దనియెను. అట వచ్చినమిత్రుడు 'ఆబి వ్రాయ లేదు గాబోలు'నని శంకించుచుండ నాబ్రహాము 'నేన వ్రాసితిని. కఱ్ఱదీసికొని యక్షరముల దీర్చితిని. ఆబి నాసంతకము' అని నుడువుచు నొకకఱ్ఱ దీసికొని మరల వ్రాయనారంభించెను. చదువుట విని వ్రాయుట కని యాగతుడు చాల ముదమంది 'ఆబి! చక్కగ వ్రాసితివి శబాస'ని యాబ్రహామును బుజ్జగించెను.

ఇందియానా నేలన ఆబ్రహాము నాడు వ్రాసినది చూడ ముందు నాతడు యునైటెడ్ స్టేట్స్ చరిత్రములో జెఱుపరాని దివ్యాక్షరముల దన నామము లిఖించుననుటకు సూచనగ నుండె నని మనకు గోచరింపక మానదు.

ఈప్రకారము పుస్తుక పఠనము పై దృష్టినిలిపి యాబ్రహాము గ్రొత్త పుస్తుకములు దనచేతి కబ్బినవి. బహు జాగ