పుట:Abraham Lincoln (Telugu).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బెట్టు ఆబ్రహాము సారాలు ప్రతిదినము నొక మైలుదూరమున నుండు బుగ్గకుపోయి పానీయంబు గొనివచ్చుచుండిరి. ఈ లోపము దరువాత నేదో యొకతెఱంగున దీసివేయబడెను.

ఇక నా సీమయందలి జనులస్థితి జూచితిమేని యందనేకులు సురకుదాసులు. సుర యన నమృత మని యర్థము సేయువారును, సురాపానము పూర్వాచారమునకు వ్యతిరేకము గాదని వాదించువారును, ఔషధతుల్యముగ గొంచెము గ్రహించిన నేమిగాగల దనువారును, మన దౌర్భాగ్యమున కానవాలుగ నిప్పుడు దేలుచున్నారు. జీర్ణకోశము మాడ్చివేసి పలురోగములకు బాలుచేసి నడయాడు శవంబుల జేయు ద్రవాకారం బగు దుష్టభుజంగ మవిష మల్లనల్లన దేహమున బ్రసరించుట నెఱుంగ నేరని మతిభ్రమణుల నా కోలాహలహరణుండగు నీశ్వరుండ మరల్చుగాక. ఓ మహనీయులారా! ఆబ్రహాము తల్లి స్నేహితదోషము దన కుమారు నంటునేమోయను భయంబున నతని కప్పుడప్పుడు చెప్పిననీతి వినుడు. ఆఘనుడు లోకమున బేరుగాంచి వెలుగుతఱి మత్తు పదార్థముల దాకకూడ దను ప్రతిన నడపునెడ "మనుష్యులు దాగుట కారంభింతురు గాన ద్రాగుబోతు లగుదురు. ఎప్పటికిని ద్రాగకుండువా డెన్నటికిని ద్రాగుబోతు గాజాలడు" అని నాతల్లి నాకు బోధించెనని చెప్పును.