పుట:Abraham Lincoln (Telugu).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూనెలు. విద్యుచ్ఛక్తి యేడినుండివచ్చు? దేహప్రాణముల గాపాడికొన నుపయుక్త మగు సామగ్రిదప్ప మఱొండు వారి కలవడ నలవిలేకుండెను. దేవు డిచ్చిన మహాటవి దమపొంతనె యుండ వారికి గట్టియలకు గరవుగాదు. ఎంత మంట గావలయు నంతమంట ప్రజ్వరిల్ల జేయ వారి కుపకరణము లుండును. కావున నీజ్వాలలప్రకాశంబె వారిపనులకెల్ల జాలియుండును.

ఇట్టి దీవియ ముంగల గూరుచుండి మన కథానాయక రత్నము చదువును. చెట్టపట్టలమీదను పలకబండలమీదను బొగ్గుతో వ్రాయుచుండును. శీతకాలమున మంచు గురియు వేళల దానిపై నొక కాష్టముతో దననామము లిఖించును. వేసవికాలమున దోటలోనికిబోయి యిసుకనేలన నభ్యసించును. ఈవిధమున శ్రద్ధజేసి వ్రాతపనియం దెంతో ప్రావీణ్యము నొందెను. గొప్పవారి కెంతటి కష్టతమము లగుస్థితిలును నాటంకములు గాజాలవు. చూచితిరే!

థామసు లింకను మంచి వేటకాడు. అతని నివాసస్థలమును వేటకు దగినదియే. చుట్టుప్రక్కల దట్ట మైన యడవియుండుట జేసి యత డనేక మృగముల బక్షులగొట్టి భోజనమునకు వస్తువుల జేర్చగల్గెను.

ఆతనిగృహ మొక్కవిషయమున దక్క నెల్లవిషయంబుల ననుకూలముగ నుండెను. జలశూన్యం బొండు వారిగష్టముల