పుట:Abraham Lincoln (Telugu).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొత్తుగ ద్రాగనివారిని, ద్రాగకుండుట యను ప్రతిన వట్టినవారిని నామె యెన్నడు గనివిని యుండలేదు. అయినను నెద్ది యీరోగమునకు దివ్యౌషధంబొ యెద్ది యీరావణునకు రామాస్త్రంబొ నద్దాని నామె గుర్తించి కుమారునకు దెల్పుట యామె సూక్ష్మదృష్టియు నామె దోషాదోషవివేచనజ్ఞానంబును వేనోళ్ల వెల్లడి చేయుచున్నది.

ఈవిషయమును మఱియొక యంశము దెలుపుడు చేయుచున్నది. ఓహీయోలో నష్టమైన సారాయివిషయ మొకరోజు నాంసీ థామసులు చర్చించుచుండిరి. వారిచర్చ గొంచెము పరిశీలించిన జాలు. "కొంతసారాయి నా నదీగతంబు సేసి దైవము మనకు దోడ్పడియెను. ఎందరో పిల్ల లాదుష్టవస్తువు దగ్గరదీసి కుటుంబనాశన మొనరించి యున్నారు. ఎల్లరకు మేలుగోరు దైవము మనకెప్పుడు సాయమొనర్చు. అట్టి వస్తు వింట నుండుటయె హానికరంబు. ఉన్న కొంచెము నమ్మివేసితిమి. వగపిక పనిలేదు." అని సంతసించిరి.

1817 వ సంవత్సరపు వేసవి సనియె. లింకనుల యొంటరి తన ముదుప వారి స్నేహితులు స్పారోలు అచట నివసింప నేతెంచిరి. స్పారోగారి భార్య నాంసిపెంపుడుతల్లి. వారు వచ్చినతోడనె లింకనుల మొదటిగృహ మగు పందిలియందు బససేసిరి. స్పారోగారి భార్య బెట్సి డెన్నిస్ హాంక్సును బెంచు