పుట:Abraham Lincoln (Telugu).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈవిధమున గృహోపకరణముల నన్నిటిని రెండు దినములలోపల జేసికొనిరి. ఆబ్రహాము విద్యాభ్యసనంబునకును నిద్రకును స్థాన మింటియందలి వెలిసెయే. ఆస్థలమున రాత్రుల నొక గొంగళి పఱచుకొని సుఖనిద్ర యనుభవించుచు ననేకసంవత్సరములు గడపెను. అదియ యతనికి మహా హర్మ్యభవనంబులలోని హంసతూలికాతల్పంబునకు సమానంబుగ నుండెను. అంతకంటె సౌఖ్యకర మగువస్తు ప్రపంచ మత డప్పుడు కని యెఱుంగడు; తరువాత గందునను తలంపు నతనికి లేదు.

1817 వ సంవత్సరము ఆకురాలుకాలము వచ్చులోపల లింకనులు దమ నూతన నివాసస్థలమున స్థిరపడి యుండిరి. అప్పటికి ఆబి కర్తవ్యాంశముల నెల్ల జక్కగ గ్రహించి యుండెను. వాచక లేఖనములగూడ మిక్కిలి పరిశ్రమ చేసి యుండెను. వారి పుస్తకభాండాగరములోని మూడుగ్రంథములు నతనికి నుపయోగకారు లై యుండె.

ఆ దేశమున శిశిరఋతువునందు జలి దుర్భరము కావున నక్కడ నివసించువా రా దివసముల మంటలు వేసుకొని రాత్రులు పుచ్చుచుందురు. ఈ యగ్నుల వెలుగుదప్ప వారి గృహముల నితర వెలుంగులు గానరాకుండును. పేదరికమున కాలవాలమైన నా 'మార్గదర్శకు'లకు క్రొవ్వువత్తులు, కెరుసిను